ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు కృషి

ABN , First Publish Date - 2022-08-07T05:23:11+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు కృషి
గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న యాదవరెడ్డి, ప్రతా్‌పరెడ్డి

ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి

పలు మండలాల్లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి

గజ్వేల్‌, ఆగస్టు 6: ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. గజ్వేల్‌ పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లో జయశంకర్‌ చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ గణపతిరావు, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ రాజమౌళి, కమిషనర్‌ విద్యాధర్‌ నివాళులర్పించారు. 

సిద్దిపేట క్రైం: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా శనివారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సీపీ శ్వేత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేట పట్టణంలో లాల్‌ కమాన్‌ వద్ద, ముస్తాబాద్‌ చౌరస్తాలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. 

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. చైర్‌పర్సన్‌ ఆకుల రజిత జయశంకర్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆర్డీవో జయచంద్రారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. 

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్‌ చౌరస్తాలో గల జయశంకర్‌ సార్‌ విగ్రహానికి విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు పబ్బోజు యాదగిరిచారి, సింగోజు మురళీకృష్ణ ఆచార్య పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే ఎస్టీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పట్నం భూపాల్‌, ప్రధాన కార్యదర్శి మట్టపల్లి రంగారావు, ముస్తాబాద్‌ చౌరస్తాలో గల జయశంకర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

 చేర్యాల: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. కొమురవెల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిలివేరు సిద్ధప్ప, చేర్యాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, తెలంగాణ తల్లి విగ్రహావరణలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ నివాళులర్పించారు. 

దుబ్బాక/మిరుదొడ్డి: దుబ్బాకలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ వనితా, రెవెన్యూ కార్యాలయాల్లో, వండ్రంగి సంఘం ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే మిరుదొడ్డి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సాయిలు, రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ వీరయ్య, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో చైర్మన్‌ సత్యనారాయణ జయశంకర్‌ నివాళులర్పించారు. 

ములుగు: ములుగు మండలంలో జయశంకర్‌ జయంతిని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గజ్వేల్‌ అధ్యక్షుడు ఏనుగు బాపురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో డాక్టర్‌ నీరజ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌ జయంతి నిర్వహించారు. 

రాయపోల్‌: రాయపోల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. 

వర్గల్‌: వర్గల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

కొండపాక: కొండపాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జీ.సత్యనారాయణ పాల్గొన్నారు. 

కోహెడ: కోహెడ మండలంలోని కూరెళ్ల, బస్వాపూర్‌ గ్రామాల్లో జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. కూరెళ్లలో సర్పంచ్‌ గాజుల రమేష్‌ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

నంగునూరు: నంగునూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జయశంకర్‌ జయంతిని నిర్వహించారు.

నారాయణరావుపేట: నారాయణరావుపేట మండల కేంద్రంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీపీ ఉపాధ్యక్షుడు సంతో్‌షకుమార్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. 

తొగుట: మండల కేంద్రమైన తొగుటలో జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తొగుట ప్రాథమిక వైద్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 2వ వర్ధంతిని నిర్వహించారు. 

జగదేవ్‌పూర్‌: మర్కుక్‌ మండలం అంగడి కిష్టాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. 



Updated Date - 2022-08-07T05:23:11+05:30 IST