Oct 25 2021 @ 20:12PM

గౌరీతో పెళ్లి వద్దని ‘వాళ్లు’ చెప్పగానే... షారుఖ్ రెస్పాన్స్ ఏంటంటే...

షారుఖ్ ఖాన్ అనగానే అందరికీ బోలెడు రొమాంటిక్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ, అతడి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ బోలెడంత రొమాన్స్ ఉంది. అలాగని, కింగ్ ఖాన్ తనతో నటించిన హీరోయిన్స్‌తో పెద్దగా ఎఫైర్స్ ఏం పెట్టుకోలేదు. 30 ఏళ్ల క్రితం ఆయన గౌరీని పెళ్లాడాడు. మూడు దశాబ్దాలుగా, ముగ్గురు పిల్లలతో వారి హ్యాపీ ఫ్యామిలీ జాయ్‌ఫుల్‌గా సాగిపోతోంది... 


1991లో గౌరీ ఖాన్‌ని వివాహం చేసుకున్న కింగ్ ఖాన్ లవ్ స్టోరీ అంతకు ముందు సంవత్సరాల తరబడి సాగింది. ఓ పార్టీలో తన కాబోయే భార్యని చూసిన బాద్షా అప్పటికీ ఢిల్లీలో ఉండేవాడు. 1984లో ఆయన వయస్సు కేవలం 18 ఏళ్లు. అప్పుడే ప్రేమలో పడిపోయిన ఎస్ఆర్కే 91 దాకా నానా తంటాలు పడి గౌరీని పెళ్లికి ఒప్పించుకోగలిగాడు. ఆమె అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ఢిల్లీలో ఉంటే తనని డిస్టబ్ చేస్తున్నాడని గౌరీ ముంబైకి వచ్చేసింది. తనతో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన ప్రియురాలి కోసం షారుఖ్ కూడా ముంబైకి వచ్చాడు. తన కెమెరా అమ్మేసి ఆ డబ్బులతో ముంబై చేరి గౌరీని వెదకటం ప్రారంభించాడు. ఓ రోజు బీచ్‌లో కనిపించగానే, ఇద్దరూ ఏమోషనల్ అయిపోయి, కన్నీళ్లు పెట్టుకుని వాటేసుకున్నారు! కానీ, అక్కడితో కథ సుఖాంతం కాలేదు...


షారుఖ్ అంటే గౌరీకే కాదు ఆమె తల్లిదండ్రులకి కూడా ఇంట్రస్ట్ లేకపోవటంతో పెళ్లికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. రెండు సార్లు ప్రపోజ్ చేస్తే కూడా ‘నో’ చెప్పిన మిస్ గౌరీ... చివరకు షారుఖ్ తల్లి చనిపోయాక... మనసు మార్చుకుంది. ఒంటరిగా మిగిలిన ఎస్ఆర్కేకు లైఫ్ లాంగ్ తోడైంది! అలా వారి మ్యారేజ్ 1991లో జరగ్గా ఆనాటి బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కొంత మంది పెళ్లి వద్దని చెప్పారట! షారుఖ్ అప్పుడప్పుడే బీ-టౌన్‌లో ఎదుగుతుండటంతో పెళ్లైన హీరోకి ఫ్యాన్స్ ఉండరని బెదరగొట్టారట. బ్యాచిలర్‌గా ఉంటేనే అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుందని చెప్పారట. కానీ, సినిమాలు, కెరీర్, ఫ్యాన్స్ కంటే గౌరీనే ప్రధానం అనుకున్న తన షారుఖ్ తన గురిని చెదిరిపోనీయలేదు. మిసెస్ గౌరీ ఖాన్‌ని తన ఇంట్లోకి సాదారంగా ఆహ్వానించాడు. అప్పట్నుంచీ వారి బంధం గత ముప్పై ఏళ్లుగా విజయవంతంగా సాగుతూనే ఉంది... 

Bollywoodమరిన్ని...