Abn logo
Apr 3 2020 @ 09:20AM

నటీనటులు, టెక్నీషియన్లకు నిర్మాత సతీష్ విజ్ఞప్తి

కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయి సినీ పరిశ్రమ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ భారం మొత్తం నిర్మాతపైనే పడుతుందని, అందువల్ల నిర్మాతలకు సహాయంగా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న సినిమాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు తమ పారితోషకంలో 30 శాతం వదులుకోవాలని తమిళ నిర్మాత జేఎస్‌కే సతీష్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే మూడు నెలలపాటు వడ్డీ, ఈఎంఐలు వసూలు చేయకూడదని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినట్లుగానే సినిమాలకు ఫైనాన్స్‌ చేసే సంస్థలు కూడా మూడు నెలలపాటు వడ్డీ పూర్తిగా రద్దు చేయాలని ఆయన కోరారు. ఇంకా లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందు విడుదలైన సినిమాలను మళ్లీ విడుదల చేసేందుకు అవకాశం కల్పించాలని థియేటర్‌ యజమానులను, పంపిణీదారులను జేఎస్‌కే సతీష్‌ కోరారు. తమిళ నిర్మాతలందరి తరపున తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరి,  దీనిని మన్నించి నటీనటులు, టెక్నీషియన్లు తమ పారితోషకంలో 30 శాతం వదులుకునేందుకు ముందుకొస్తారంటారా?

Advertisement
Advertisement
Advertisement