Abn logo
Jul 9 2020 @ 23:38PM

ఆరోగ్యంగానే ఉన్నా... - నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌

కర్ణాటకలో కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ నేతలు, సినీ నటులు గజగజ వణికిపోతున్నారు. మండ్య ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి విదితమే. ఆ సమయంలో ఆమె వెంట ఉన్న ప్రముఖ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తాయంటూ సోషల్‌మీడియాలో వదంతులు వ్యాపించాయి. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని వైద్య పరీక్షలు జరుపుకోగా నెగటివ్‌ రిపోర్టు వచ్చిందని రాక్‌లైన్‌ వెంకటేశ్‌ స్వయంగా గురువారం మీడియాకు వివరణ ఇచ్చారు. కాగా సినీ నటులు, బుల్లితెర నటులు తమ ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైన మేరకు అభిమానులు ఎవ్వరినీ భేటీ కావద్దని కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి సూచించింది.


- ఆంధ్రజ్యోతి, బెంగళూరు  

Advertisement
Advertisement
Advertisement