నిర్మాత ఎన్ఎస్ నాయక్ ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2021-10-28T21:58:12+05:30 IST

విమర్శకుల చేత ప్రశంసలు పొందిన ‘హార్మోన్స్’ చిత్ర నిర్మాత, గిరిజన సంక్షేమ సమితి వ్యవస్థాపకులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు నూనావత్ సారయ్య నాయక్ గుండె పోటుతో ఈ నెల 25 న హైదరాబాదులో మరణించారు.

నిర్మాత ఎన్ఎస్ నాయక్ ఆకస్మిక మృతి

విమర్శకుల చేత ప్రశంసలు పొందిన ‘హార్మోన్స్’ చిత్ర నిర్మాత, గిరిజన సంక్షేమ  సమితి వ్యవస్థాపకులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు నూనావత్ సారయ్య నాయక్ గుండె పోటుతో ఈ నెల 25 న హైదరాబాదులో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. వరంగల్ ములుగు జిల్లా, పత్తిపల్లి గ్రామనికి చెందిన సారయ్య సామాజిక కథాంశంతో డా.ఆనంద్ దర్శకత్వంలో 2012లో ‘హార్మోన్స్’ అనే చిత్రాన్ని నిర్మించగా, అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, రామానాయుడు, డి.టి.నాయక్ తదితరుల ప్రశంసలు పొందింది. తర్వాత డా.ఆనంద్ దర్శకత్వంలోనే  బాలికా విద్య, మానవ హక్కులు, మహిళా సాధికారత కథాంశంగా ‘ప్రజా హక్కు’, ‘అంటురానితనం’, ‘చిరు తేజ్ సింగ్’ వంటి లఘు చిత్రాలను నిర్మించి, అభిరుచి కలిగిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ప్రముఖ బాలనటులు అవంతికా వందనపు, హాసిని అన్విలను పరిచయం చేసింది ఈయనే. నాయక్ మృతి పట్ల దర్శకులు, సామాజిక కార్యకర్త అయిన డా.ఆనంద్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కొత్త వారిని పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే వారని ఆయన సేవలను కొనియాడారు.



Updated Date - 2021-10-28T21:58:12+05:30 IST