Tollywood: నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మృతి

కె.ఎస్. నాగేశ్వరరావు, శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి.. కేవలం నాలుగు రోజుల్లో ముగ్గురు సెలబ్రిటీలను టాలీవుడ్ కోల్పోయింది. ఇప్పుడు నిర్మాత జక్కుల నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో టాలీవుడ్‌ మరోసారి శోక సంద్రంలో మునిగిపోయింది. ‘లవ్ జర్నీ’, ‘అమ్మా నాన్న ఊరెళితే’, ‘వీడు సరైనోడు’ వంటి చిత్రాల నిర్మించిన జక్కుల నాగేశ్వరరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం మంటాడ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై... అక్కడికక్కడే మృతి చెందారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జక్కుల నాగేశ్వరరావు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

Advertisement