కోర్టుకు హాజరైన Bandla Ganesh.. అందుకే అరెస్ట్ చేయలేదా..!?

ABN , First Publish Date - 2021-12-28T05:47:21+05:30 IST

కోర్టుకు హాజరైన Bandla Ganesh.. అందుకే అరెస్ట్ చేయలేదా..!?

కోర్టుకు హాజరైన Bandla Ganesh.. అందుకే అరెస్ట్ చేయలేదా..!?

  • చెక్‌బౌన్స్‌ కేసులో కోర్టుకు హాజరైన నిర్మాత గణేష్‌
  • పరమేశ్వరీ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో చెక్‌
  • వచ్చే నెల 9కి వాయిదా వేసిన న్యాయమూర్తి


ఒంగోలు (క్రైం), డిసెంబరు 27: చెక్‌బౌన్స్‌ కేసులో సినీనిర్మాత బండ్ల గణేష్‌ ఒంగోలు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. వారెంటు పెం డింగ్‌ ఉండటంతో న్యాయమూర్తి ఎదుట హాజరై రీకాల్‌ చేయించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగులుప్పలపాడు మండలం మద్దిరాల- ముప్పాళ్లకు చెందిన జెట్టి జానకిరామయ్య వద్ద సినీ నిర్మాత బండ్ల గణేష్‌ 2018లో రూ.95లక్షలు అప్పు తీసుకున్నారు. అందుకు సంబం దించి పరమేశ్వరీ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో అప్పట్లో చెక్కు ఇచ్చారు.


అనంతరం జానకిరామయ్య అకాల మరణం చెందారు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్లు పలుమార్లు గణేష్‌ను డబ్బు అడిగారు. ఆయన స్పందించకపోవడంతో 2019 ఫిబ్రవరిలో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్ర యించారు. విచారణకు హాజరుకావాలని కోర్టు గణేష్‌కు పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా గణేష్‌ కోర్టుకు రాలేదు. దీంతో ఈనెల 13న గణేష్‌కు కోర్టు అరెస్టు వా రెంటు జారీచేసింది. దీంతో ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. వా రిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. 


కొంతమంది ప్రజాప్రతినిధుల హామీ మేరకు పోలీసులు అరెస్టు చేయకుండా తప్పనిసరిగా సోమవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని చెప్పి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం వ్వక్తిగతంగా ఒంగోలు రెండో  మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గణేష్‌ హాజరయ్యారు. దీంతో అరెస్టు వారెంటును రీకాల్‌ చేసిన న్యాయమూర్తి కేసును వ చ్చేనెల 9కి వాయిదా వేశారు. అంతేకాకుండా ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరుకావాలని బండ్ల గణేష్‌ను ఆదేశించినట్లు తెలిసింది.



Updated Date - 2021-12-28T05:47:21+05:30 IST