Apr 21 2021 @ 00:40AM

కరోనాతో నిర్మాత సి.ఎన్‌. రావు మృతి

తెలుగు నిర్మాత సి.ఎన్‌. రావును కరోనా బలి తీసుకుంది. మహమ్మారి వైరస్‌ కారణంగా మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు చిట్టి నాగేశ్వరరావు. తెలుగులో ‘మా సిరిమల్లె’, ‘అమ్మ నాన్న లేకుంటే’, ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’, తమిళంలో ‘ఊరగా’ చిత్రాలు నిర్మించారు. ఆయన పంపిణీదారుడు కూడా! గతంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యుడిగా సేవలు అందించిన సి.ఎన్‌. రావు, ప్రస్తుతం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, నిర్మాతల సెక్టార్‌ కార్యదర్శిగా, సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఈసీ సభ్యుడిగా వివిధ హోదాల్లో ఉన్నారు. ఆయన భార్య పేరు సరస్వతి.