Abn logo
Apr 10 2020 @ 17:27PM

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ‘బిచ్చగాడు’ నిర్మాత సాయం

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం స్తంభించి పోయింది. చిత్ర పరిశ్రమలో పనులు కూడా ఆగిపోయాయి. దీనితో చాలా మంది నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పేద కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ‘సిసిసి మనకోసం’ అనే సంస్థ స్థాపించారు. ఆ సంస్థకు తను విరాళం ఇవ్వడమే కాకుండా ఇతర నటీనటులు కూడా ఇచ్చేలా స్ఫూర్తి నింపి, వచ్చిన విరాళాలతో పేద కార్మికులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో చేతిలో ఉన్న సొమ్మంతా సినిమాలకు పెట్టి ఇబ్బందులు పడుతున్న నిర్మాతలను ఆదుకునేందుకు తనవంతుగా నిర్మాతల మండలికి ఆపన్న హస్తం అందించేందుకు సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. ఆయన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి రూ. 10,11,111 విరాళం అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతల కోసం ఈ మొత్తం ఉపయోగించాలని కోరారు. అవసరమైతే మరోసారి కూడా తాను సాయం చేస్తానని తెలిపారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ డబ్బును నిర్మాతలు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్లకు అందజేశారు.

Advertisement
Advertisement
Advertisement