Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 16 Aug 2022 16:05:32 IST

Rangeela : చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవి చెయ్యాల్సిన సినిమానా?

twitter-iconwatsapp-iconfb-icon

ఏ సినిమా ఎవరితో రాసిపెట్టి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చల దశలో ఉండగా.. దర్శకుడు కొందరు నటీనటుల్ని ఫిక్స్ చేసుకొని నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకోసారి దర్శకుడు ముందుగా అనుకొన్న తారాగణం కొన్ని కారణాల వల్ల సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సినిమానే బాలీవుడ్‌లో సూపర్ హిట్టయిన రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) ‘రంగీలా’ (Rangeela). నిజానికి ఈ చిత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth), అందాల శ్రీదేవి (Sridevi) లతో తెరకెక్కాలి. కానీ ఆ అరుదైన కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం రామ్ గోపాల్ వర్మకు దక్కకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఒక టీవీ షోలో నిర్మాత అశ్వనీదత్ (Ashwani datt) స్వయంగా తెలిపారు. 

‘శివ’ (Shiva) సినిమా చూసి ఎంతగానో థ్రిల్ అయిపోయి.. రామ్ గోపాల్ వర్మ చేతుల్లో అశ్వనీదత్ అడ్వాన్స్ పెట్టారు. ఆయనకి ‘రంగీలా, గోవిందా గోవిందా’ (Govinda Govinda) కథల్ని అశ్వనీదత్ కు వినిపించారు వర్మ. ‘రంగీలా’ చిత్రాన్ని చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవిలతో చేస్తే సూపర్ హిట్ అవుతుందని వర్మ నమ్మారు. కానీ అశ్వనీదత్‌కు ‘గోవిందా గోవిందా’ కథ నచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో దోపిడీ కథాంశం ఆయన్ను బాగా ఇంప్రెస్ చేసింది. పైగా నాగార్జున (Nagarjuna) అందుబాటులో ఉండే హీరో. అందుకే అశ్వనీదత్ ‘రంగీలా’ను పక్కన పెట్టి ‘గోవిందా గోవిందా’ చిత్రం నిర్మించారు. 

‘రంగీలా’ చిత్రమైతే .. అందులో శ్రీదేవి పాత్ర ఒక్కటే హైలైట్ అవుతుంది. మిగిలిన ఇద్దరు హీరోలవీ అతిథి తరహా పాత్రలు. అందుకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకోవల్సి వచ్చిందని టీవీలో షోలో తెలిపారు అశ్వనీదత్. తీరా చూస్తే ‘గోవిందా గోవిందా’ ఫ్లాప్ అయింది. బాలీవుడ్‌లో ఊర్మిళ (Urmila), ఆమిర్ ఖాన్ (Aamir Khan), జాకీ ష్రాఫ్ (Jacky Shrof) లతో తీసిన ‘రంగీలా’ సినిమా సూపర్ హిట్టయింది. తెలుగులో ఇదే సినిమా ‘రంగేళి’ (Rangeli) గా విడుదలై. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మరి ఈ సినిమా గాని నిజంగానే..  చిరంజీవి, రజనీకాంత్, శ్రీదేవిలతో తీసి ఉంటే.. దాని రిజల్ట్ ఎలా వచ్చేదో. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement