ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2020-04-05T00:22:47+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా రైతుల వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకు వస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం: కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్మూలనలో భాగంగా  రైతుల వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకు వస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం ముదిగొండ మండలంలోని మేడిపల్లి, కట్టకూరు, మాదాపురం, వనం వారి కృష్ణాపురం గ్రామాల్లో ప్రభుత్వం రైతుల సౌకర్యార్ధం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. శనివారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? రైతులకు ఇబ్బందులేమైనా ఉన్నాయా? అన్నవిషయాలను మంత్రి అజయ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ లాక్‌డౌన్‌ నేపధ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అని రైతుల సమస్యల సంక్షేమానికి పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T00:22:47+05:30 IST