Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 02 Apr 2022 20:51:33 IST

ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తైంది. చిన్న చిన్న మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. త్వరలో తుది గెజిట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్ధమైంది. ఏపీలో 51 నుంచి 73కి రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతధంగా కొనసాగుతాయి.


ఏపీలో రెవెన్యూ డివిజన్ల పెంపు

శ్రీకాకుళం జిల్లా: పలాస, టెక్కలి, శ్రీకాకుళం 

విజయనగరం: బొబ్బిలి(కొత్త), చీపురుపల్లి(కొత్త), విజయనగరం 

పార్వతీపురం మన్యం రెవెన్యూ డివిజన్లు: పార్వతీపురం, పాలకొండ

అల్లూరి సీతారామరాజు రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం 

విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం(కొత్త), విశాఖ

అనకాపల్లి రెవెన్యూ డివిజన్లు: అనకాపల్లి, నర్సీపట్నం

కాకినాడ రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ.

కోనసీమ: రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట(కొత్త)

తూర్పుగోదావరి రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు 

ప.గో జిల్లా రెవెన్యూ డివిజన్లు: నర్సాపురం, భీమవరం(కొత్త)


ఏలూరు రెవెన్యూ డివిజన్లు: జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

కృష్ణా రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు(కొత్త)

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ, తిరువూరు(కొత్త), నందిగామ(కొత్త)

గుంటూరు రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి

బాపట్ల రెవెన్యూ డివిజన్లు: బాపట్ల(కొత్త), చీరాల(కొత్త)

పల్నాడు రెవెన్యూ డివిజన్లు: గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి(కొత్త)

ప్రకాశం రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, ఒంగోలు, కనిగిరి(కొత్త)

నెల్లూరు రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

కర్నూలు రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ(కొత్త)

నంద్యాల రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు(కొత్త), డోన్(కొత్త), నంద్యాల


అనంతపురం: అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్(కొత్త)

శ్రీసత్యసాయి: ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి(కొత్త)

కడప రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు

అన్నమయ్య రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, మదనపల్లె, రాయచోటి(కొత్త)

చిత్తూరు రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి(కొత్త), పలమనేరు(కొత్త), కుప్పం(కొత్త)

తిరుపతి రెవెన్యూ డివిజన్లు: గూడూరు,సూళ్లురుపేట, శ్రీకాళహస్తి(కొత్త), తిరుపతి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.