రేషన్‌..పరేషాన్‌

ABN , First Publish Date - 2020-04-03T10:15:39+05:30 IST

చౌటుప్పల్‌ మండలంలో 43 రేషన్‌ షాపులు ఉదయం ఏడు గంటల నుంచే భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్‌లో ఉన్నారు. ప్రజల వేలిముద్రల కు బదులుగా ఆథరైజ్డ్‌గా షాపునకు ఒక్కరి వేలిముద్ర వచ్చే విధంగా ఏర్పా ట్లు చేశారు. కానీ, ఈ-పాస్‌ యంత్రం పనిచేయ

రేషన్‌..పరేషాన్‌

చౌటుప్పల్‌ మండలంలో 43 రేషన్‌ షాపులు ఉదయం ఏడు గంటల నుంచే భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్‌లో ఉన్నారు. ప్రజల వేలిముద్రల కు బదులుగా ఆథరైజ్డ్‌గా షాపునకు ఒక్కరి వేలిముద్ర వచ్చే విధంగా ఏర్పా ట్లు చేశారు. కానీ, ఈ-పాస్‌ యంత్రం పనిచేయలేదు. నాలుగు గంటల పాటు లైన్లో ఉన్నా లబ్ధిదారులకు బియ్యం అందలేదు. దీంతో లబ్ధిదారులు బియ్యం ఇవ్వకుండా తమను వెనక్కి పంపడంపై నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల ఎదుట ఆందోళనకు దిగారు. సంతకాలు తీసుకొని బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆకలితో అల్లాడుతున్న ప్రజలను నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. శాలిగౌరారంలో బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. గంటల తరబడి సర్వర్‌ బిజీగా ఉండటంతో వినియోగదారులు ఎండలో నిరీక్షించారు. బయోమెట్రిక్‌ యంత్రం లేకుండా కూపన్లద్వారా పంపిణీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. నార్కట్‌పల్లి మండలంలో 29 రేషన్‌ షాపులకు రెండు దుకాణాల్లో సాంకేతిక సమస్యతో బియ్యాన్ని ఆలస్యంగా పంపిణీ చేశారు.


రెండు రోజులు తిరిగా

నేను రేషన్‌ బియ్యం కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. బుధవారం సాయం త్రం 6 గంటల వరకు క్యూలో నిలబడ్డా ను. ఆన్‌లైన్‌ సర్వర్‌ పనిచేయడం లేదని పంపించారు. గురువారం ఉదయం 9 గంటలకే వచ్చి క్యూ కట్టాను. మధ్యాహ్నం 12 గంటలకు రేషన్‌ ఇచ్చారు. బియ్యం ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. గంటకు ముగ్గురికి మాత్రమే ఇస్తున్నారు. త్వరగా ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

-  రాంరెడ్డి, లబ్ధిదారుడు, నల్లగొండ 

Updated Date - 2020-04-03T10:15:39+05:30 IST