దేవరకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు
ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్: తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు గురువారం జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలనిడ డిమాండ్ చేశారు. వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెన్షన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.