మెదడుకు మేత...కళ్లకు వాత!

ABN , First Publish Date - 2020-06-30T09:58:54+05:30 IST

కరోనా కాలమిది. జీవితాలను మాత్రమే కాదు జీవనశైలినీ మార్చిందీ కరోనా. గతంలో తప్పు అనుకున్నది ఇప్పుడు తప్పనిసరి అయింది.

మెదడుకు మేత...కళ్లకు వాత!

ఆన్‌లైన్‌ క్లాసులతో సమస్యలు


 హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి) :

కరోనా కాలమిది. జీవితాలను మాత్రమే కాదు జీవనశైలినీ మార్చిందీ కరోనా. గతంలో తప్పు అనుకున్నది ఇప్పుడు తప్పనిసరి అయింది. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో స్మార్ట్‌ ఉపకరణాల వల్ల పిల్లల ఆరోగ్యం, ఏకాగ్రత దెబ్బతింటోందని, వాటికి దూరంగా ఉంచాలని గతంలో టీచర్లు హెచ్చరికలు చేసేవారు. కానీ ప్రస్తుతం విద్యకు దూరం కాకుండా ఉండాలంటే మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు లేదంటే కంప్యూటర్లు వాడాల్సిందేనని ఉద్బోధిస్తున్నారు.


ఇప్పటికే చాలా పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించాయి.  రోజుకు రెండు మూడు గంటలతో కొన్ని పాఠశాలలు ముగిస్తే, మరికొన్ని పాఠశాలలు 8 గంటలు బోధిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు ఆన్‌లైన్‌లో హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి పంపాలని చెబుతున్నాయి. దీంతో పిల్లలు ఇప్పుడు రోజుకు 8 నుంచి 10 గంటలు స్మార్ట్‌ ఉపకరణాలతోనే గడుపుతున్నారు. ఇవే ప్రస్తుతం పిల్లల నేత్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.


ఇంతకుముందు సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల్లో కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌(సీవీఎస్‌), డ్రై ఐస్‌, ఐ స్ట్రెయిన్‌ బాధితులు కనబడే వారు. కానీ ఇకపై పిల్లల్లోనూ ఈ తరహా బాధితులు కనబడే అవకాశాలు అధికంగానే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే మమోపియా బాధితులు నగరంలో ఎక్కువని, సీవీఎస్‌ బాధితులకూ కొదవలేదని, కంప్యూటర్లు, మొబైల్స్‌ అధిక వినియోగంవల్ల ఐ పోశ్చర్‌, టెక్ట్స్‌నెక్‌, వీ-ఇటీస్‌, స్ర్కీన్‌ సైటెడ్‌నెస్‌ వంటి సమస్యలతో పాటు... వెలుతురు తగినంత లేకపోవడం, సరిగా లేని ఇంటి డిజైన్‌, వెరసి పిల్లల ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని అంటున్నారు. రోజుకు 3 గంటల కన్నా అధికంగా కంప్యూటర్‌ లేదంటే డిజిటల్‌ తెరలపై పనిచేస్తే వయసుతో సంబంధం లేకుండా సీవీఎస్‌ లక్షణాలు అభివృద్ధి కావడానికి 90ు అవకాశం ఉందంటున్నారు వైద్యులు. 


కళ్లతో నిమిషానికి 60 పుషప్స్‌ చేస్తున్నారు?

మనిషి జీవితంలో మూడోవంతు నిద్రకే కేటాయిస్తాడనుకుంటే మిగిలిన సమయం విద్య, తదితర అంశాల కోసం వెచ్చిస్తుంటాడు. ఇప్పుడు మిగిలిన సమయంలో అధిక శాతం ఎల్‌సీడీ/ఎల్‌ఈడీ స్ర్కీన్‌లకు అతుక్కుపోతున్నాడు. కొంతకాలం క్రితం ఇండస్ట్రీయల్‌ డిజైన్‌ సెంటర్‌ ఐఐటీ- ముంబై చేసిన అధ్యయనంలో సాధారణంగా ఓ ఉద్యోగి కంప్యూటర్లు, స్ర్కీన్‌, డాక్యుమెంట్‌, కీ బోర్డ్‌ నడుమ కంటి దృష్టిని రోజుకు 25 వేల సార్లు షిఫ్ట్‌ చేస్తుందని తేల్చారు. అంతేకాదు.. 60 పుష్‌ప్సను ఒక నిమిషంలో చేయడంతో ఇది సమానమని కూడా లెక్కగట్టారు. ఇది చాలదా మన కళ్లు ఎంతగా అలిసిపోతున్నాయో చెప్పడానికి..! ఉద్యోగుల విషయంలోనే ఆ సంస్థ అధ్యయనం చేసి ఉండొచ్చు... కానీ పిల్లలు అందుకు మినహాయింపేమీ కాదన్ననది వైద్యుల వాదన.

భౌతికంగా ఓ పుస్తకం చదవడం లేదంటే ఈ -రీడర్‌లో బుక్‌ చదవడం.. రెండు ఒకటే కాదంటున్నారు వైద్యులు. కరోనా నేపథ్యంలో పలు స్కూల్స్‌ తప్పని సరి పరిస్థితుల్లో విద్యను అందిస్తున్నా తగిన జాగ్రత్తలను పిల్లలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. 


కళ్ల సమస్యలు రాకుండా..

  • కంప్యూటర్‌ లేదా స్ర్కీన్‌ ఏదైనాసరే కనీసం 25-28 అంగుళాలు దూరంగా కంటికి ఉండాలి.  
  • స్మార్ట్‌ఫోన్‌ కంటికి 16-18 అంగుళాల దూరంగా ఉండాలి.  
  • రూమ్‌లో కంప్యూటర్‌ వాడేవారు బయట నుంచి వచ్చే లైట్‌ను స్ర్కీన్‌పై పడకుండా చూసుకోవాలి.  కంప్యూటర్‌ బ్రైట్‌నెస్‌ 50ు మాత్రమే ఉంచుకోవాలి. నైట్‌ మోడ్‌ ఆన్‌ చేసుకుంటే సూతింగ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.  
  • స్ర్కీన్‌ లైట్స్‌, బ్లూ లైట్‌ చాలా ప్రమాదకరం. ఇది కంటి రెటీనా లోపలికి వెళ్లి రెటీనాలో మాక్యులాపై ప్రభావం చూపుతుంది. మెదడుకు ఫాల్స్‌ ఇంప్రెషన్‌ ఇస్తుంది. మెలటోనిన్‌ అనే రసాయనం విడుదల చేయడం ఆపేస్తుంది. దీనివల్ల స్లీప్‌ డిజార్డర్స్‌ వస్తాయి.
  • 20-20-20 రూల్‌ను అనుసరిస్తే కంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. ప్రతి 20 నిమిషాలకు  20 అడుగులు దూరంగా 20 సెకన్లు ఆబ్జెక్ట్‌ పై దృష్టి కేంద్రీకరించడం. నిమిషానికి కనీసం 10 సార్లు అయినా కనురెప్పలు మూసి తెరిస్తే మంచిది.


కళ్లు ఎర్రబడతాయి 

సాధారణంగా మన కళ్లు నిమిషానికి 22 సార్లు బ్లింక్‌ అవుతాయి. మనం పుస్తకాలు చదుతున్నప్పుడు 10 సార్లు బ్లింక్‌ అయితే డిజిటల్‌ స్ర్కీన్‌లో అది 7కు పడిపోతుంది. ఒక్కోసారి ఈ ఏడు సార్లు కూడా ఉండదు.   దీనివల్ల కళ్లు పొడిబారడం.. ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి.  అత్యంత వేగంగా పెరుగుతున్న గాడ్జెట్స్‌ వినియోగం వల్ల ఐ పోశ్చర్‌, బ్లాక్‌బెర్రీ థమ్స్‌, వి-ఇటీస్‌, స్ర్కీన్‌ సైటెడ్‌నెస్‌ వంటి సమస్యలు పెరుగుతున్నాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 

- డాక్టర్‌ రవి, కన్సల్టెంట్‌ ఆప్తల్మాలజిస్ట్‌


ఆన్‌లైన్‌ క్లాస్‌ల కారణంగా..

కరోనా వల్ల ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య పెరిగింది. ఆన్‌లైన్‌ విద్య కారణంగా పిల్లలు డిజిటల్‌ స్ర్కీన్‌లకు అతుక్కుపోతున్నారు. పెద్దవారు కనీసం 11-14 గంటలు కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పల మీదనే గడుపుతుంటే, ఆన్‌లైన్‌ క్లాస్‌ల కారణంగా పిల్లలు 9-10 గంటలు వీటిమీదనే గడుపుతున్నారు. దీంతో కళ్లకు ప్రధానంగా మూడు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా డిజిటల్‌ స్ర్కీన్‌లకు అతుక్కుపోవడంవల్ల ఐ స్ట్రెయిన్‌, పొడిబారడం, మియోపియా సమస్యలు వస్తాయి.  

- డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్స్‌ హైదరాబాద్‌ క్లినికల్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ డాక్టర్‌ వంశీధర్‌

Updated Date - 2020-06-30T09:58:54+05:30 IST