బంకుల్లో పెట్రోల్‌ లభించక ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-05-24T05:35:30+05:30 IST

బంకుల్లో పెట్రోల్‌ లభించక ఇబ్బందులు

బంకుల్లో పెట్రోల్‌ లభించక ఇబ్బందులు
బొంరా్‌సపేట్‌లోని పెట్రోల్‌ బంక్‌

బొంరా్‌సపేట్‌, మే 23: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడంతో పెట్రోల్‌ బంకు ల్లో పెట్రోల్‌, డీజిల్‌ ఖాళీ అయింది. రెండు రోజులు గా బొంరా్‌సపేట్‌, తుంకిమెట్ల పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లేక వాహనదారులు ఇబ్బందులు ప డుతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు భూములు దున్నుకునేందుకు ట్రాక్టర్లలో వాడేందుకు డీజిల్‌ లేక సాగు పనులు నిలిచా యి. సొంత వాహనదారులు సైతం పెట్రోల్‌, డీజిల్‌ లేక ఏటూ పోలేక పనులకు వాయిదా వేసుకుంటున్నారు. ధరలు పెరిగిన సమయంలో అందుబాటులో ఉండే పెట్రోల్‌, డీజిల్‌ ఎనిమిది రూపాయలు తగ్గడంతో బంకుల నిర్వాహకులు కొరత సృష్టించి రీటైల్‌ దుకాణాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకునేందుకు బ్లాక్‌ చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు బంకు ల్లో పెట్రోల్‌, డిజీల్‌ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-24T05:35:30+05:30 IST