Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్కువగా నిద్రపోతే ఆరోగ్యానికి హాని

ఆంధ్రజ్యోతి(20-03-2020):


నిద్రతో చిన్నారులలో జ్ఞాపకశక్తి

నిద్ర అలసిన శరీరానికి ఉపశమనం ఇస్తుంది. రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉంటారన్న విషయాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా యూరప్‌లోని వార్విక్‌ యునివర్సిటీ పరిశోధకులు చిన్నారుల నిద్ర వారిలో మేధాశక్తికి ఎంత మేరకు దోహదం చేస్తుందన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు. చిన్నారులు కంటినిండా నిద్రపోకుంటే వారిలో మేధాశక్తి ఆశించిన మేరకు పెరగదనీ, నిద్ర వల్ల మెదడులో నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయని వారు గుర్తించారు.


తక్కువ సమయం నిద్రపోయే వారిలో మేధాశక్తి తగ్గడంతో పాటు మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. వీరు 9 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన పదకొండువేల మంది చిన్నారులపై పరిశోధనలు నిర్వహించారు. వాళ్ళు రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారు? వారి తెలివితేటలు ఏ విధంగా పెరుగుతున్నాయి? మేధాశక్తిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. 

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement