Abn logo
Sep 24 2021 @ 14:04PM

డీప్ ఫ్రై చేసిన జంక్ ఫుడ్ తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(24-09-2021)

ప్రశ్న: ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అంటే ఏమిటి? ఇవి ఏ ఆహార పదార్థాలలో ఉంటాయి?  వీటి వల్ల నష్టాలేమిటి?


- శిరీష, విజయవాడ


డాక్టర్ సమాధానం: ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఓ రకమైన అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌. పాలు, రెడ్‌ మీట్‌లలో ఇవి తక్కువ మోతాదులో ఉంటాయి. సహజమైన ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు నూనెలను పార్షియల్‌ హైడ్రోజినేషన్‌ అనే ప్రక్రియ ద్వారా ప్రాసెసింగ్‌ చేసినప్పుడు వాటిలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ తయారవుతాయి. ఈ విధంగా కృత్రిమంగా తయారైన ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఆరోగ్యానికి హానికరమైనవి. బేకరీ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, డీప్‌ ఫ్రై చేసిన జంక్‌ ఫుడ్‌, అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, కృత్రిమ వెన్న (మార్జరీన్‌), డాల్డా, వనస్పతి లాంటి వాటిలో ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువవుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ పెంచుతాయి. తద్వారా రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Health Latest newsమరిన్ని...