Abn logo
Feb 27 2021 @ 00:07AM

తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

గుజరాతీపేట: తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్క రించాలని ఆ సంఘం కార్యద ర్శులు కె.గణపతి, ఎల్‌.బాబూ రావు, డి.సూర్యనారాయణలు డిమాండ్‌ చేశారు. నగరంలో ని తపాలా డివిజనల్‌ సూప రింటెండెంట్‌ కార్యాలయం వద్ద  ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ, టార్గెట్లు అప్పగించి ఉద్యోగులను ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. జీడీఎస్‌లకు జీతా లు/పెయిడ్‌ లీవ్‌లను నిలిపివేశారన్నారు. సమస్యలపై మార్చి 17న రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డివిజనల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వైఎస్‌ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కె.చంద్రశేఖరరావు, జ్యోతీశ్వరరావు, ఎన్‌.కామేశ్వరరావు, ఈశ్వరరావు, దమయంతి, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement