మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ కార్మికుల నిరసన
శ్రీకాళహస్తి, జనవరి 24: ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య అన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రివర్స్ పీఆర్సీని రద్దు చేసి, కార్మికులకు కరోనా కిట్లు పంపిణీ చేయాలన్నారు. అనంతరం సమస్యలపై కమిషనర్ బాలాజీ నాయక్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్, కోగిల హరి, జాన్, తిరుపాల్, కొండమ్మ, మోహన్, సిద్ధయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.