విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:09:16+05:30 IST

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సెస్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించారు.

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

- చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

బోయినపల్లి, ఏప్రిల్‌ 16: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె  రవిశంకర్‌ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సెస్‌ ఆధ్వర్యంలో వినియోగదారుల సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   తెలంగాణ ఏర్పడక ముందు సమైక్యాంధ్ర పాలనలో విద్యుత్‌ కోసం రైతన్నలు రోడ్డెక్కే పరిస్థితి ఉండేదని అన్నారు.   రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ సాగుకు 24 గంటల కరెంట్‌ను అందిస్తున్నారన్నారు. పరిశ్రమలకు సైతం పవర్‌ హాలీడే ప్రకటించేదని ప్రస్తుతం 24 గంటలు సరఫరా అవుతోందన్నారు. సెస్‌ పరిధిలోని అన్ని గ్రామాల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పని చేయాలన్నారు. గతంలో విద్యుదాఘాతంతో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో సెస్‌ ఎండీ రామకృష్ణ, విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ రంగారావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య, సెస్‌ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T05:09:16+05:30 IST