డయాలసిస్‌ మానకండి!

ABN , First Publish Date - 2020-04-14T05:54:16+05:30 IST

మూత్ర పిండాల సమస్య ఉన్న రోగులకు లాక్‌డౌన్‌ క్లిష్టంగా మారింది. ప్రయాణ సాధనాల కొరత ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయుంచుకోవడం...

డయాలసిస్‌ మానకండి!

మూత్ర పిండాల సమస్య ఉన్న రోగులకు లాక్‌డౌన్‌ క్లిష్టంగా మారింది. ప్రయాణ సాధనాల కొరత  ఉన్నప్పటికీ క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయుంచుకోవడం ఆలస్యం చేయకూడదు అంటున్నారు వైద్యులు!


  1. మూత్రపిండాలు ఫెయిల్‌ అయిన వారిలో రోగనిరోధకశక్తి తక్కువ. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్‌ డిస్టెన్సింగ్‌ వీరు కచ్చితంగా పాటించాలి. 
  2. చికిత్స కోసం బయటకు వెళ్లడం కోసం సొంత వాహనం వాడడం మేలు. డయాలసిస్‌ సెంటర్‌లో కూడా సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ, శానిటైజర్లను వాడుకోవాలి. 
  3. సమయానికి డయాలసిస్‌ చేయించుకోకపోతే, కార్డియాక్‌ అరెస్ట్‌ అనే గుండె ఆగిపోయే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 
  4. డయాలసిస్‌ సెంటర్లకు ప్రయాణించడం ఇబ్బందిగా మారిన ప్రస్తుత సమయంలో, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. అలాగే తీసుకునే ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు పాటించాలి. 

Updated Date - 2020-04-14T05:54:16+05:30 IST