అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-31T05:12:36+05:30 IST

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవా రం ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రశేఖర్‌

వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కడప కలెక్టరేట్‌ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన ధర్నా

కడప(రవీంద్రనగర్‌), జూలై 30: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవా రం ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన జిల్లా గౌరవాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌, మనోహర్‌ మాట్లాడుతూ మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎ్‌సకు నిధులు పెంచలేదని, కనీస వేతన చట్టం ప్రకారం రూ.21వేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకువచ్చిందన్నారు. జీవో నెం.170 ప్రకారం ఒక కిలోమీటరు లోపు స్కూళ్లను మూడు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఉన్న ఉన్నత పాఠశాలల్లో కలపడం వల్ల నిరుపేద పిల్లలు డ్రాపౌట్స్‌గా మిగిలే పరిస్థితి ఉందన్నారు. వైసీపీ ప్రభు త్వం ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన, జిల్లాలోని అంగన్వా డీ యూనియన నాయకులు అంజలి, శ్రీలక్ష్మి, లక్ష్మీ, సుభాషిణి, ఖాజాబీ, అంజలి, కళావతి, ఈశ్వరమ్మ, భాగ్య, వినోద్‌, అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T05:12:36+05:30 IST