చాణక్య నీతి: ఈ పనులకు దూరంగా ఉంటే జీవితంలో సమస్యలు రమ్మన్నారావు.. అవేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2021-11-18T11:56:35+05:30 IST

ఆచార్య చాణక్య‌ తన లోతైన అధ్యయనాలు..

చాణక్య నీతి: ఈ పనులకు దూరంగా ఉంటే జీవితంలో సమస్యలు రమ్మన్నారావు.. అవేమిటో తెలుసా?

ఆచార్య చాణక్య‌ తన లోతైన అధ్యయనాలు, జీవితానుభవాల నుండి పొందిన అమూల్యమైన జ్ఞానాన్ని మానవ సంక్షేమం కోసం నిస్వార్థంగా గ్రంథాల రూపంలో అందించారు. వీటిలో జీవితానికి సంబంధించిన విధానాలు అనేకం ఉన్నాయి. అలాంటి కొన్ని విషయాలు చాణక్య నీతి ద్వారా తెలియ‌జేశారు. వీటిని పాటించ‌డం వ‌ల్ల మ‌నిషి తెలివిగా మెల‌గ‌డంతోపాటు, జీవితంలో ఎదుర‌య్యే ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ పడతాడు. కొన్ని విష‌యాలకు మ‌నిషి దూరంగా ఉండాల‌ని, లేదంటే చిక్కుల్లో ప‌డ‌తార‌ని చాణ‌క్య హెచ్చ‌రించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మూర్ఖుడికి ఉపదేశించడం: 

మూర్ఖుడికి ఏదైనా బోధించాల‌నుకుంటే ఎంత‌టి పండితుడైనా ఇబ్బందుల్లో పడతాడు. మూర్ఖుడు తన మొండిత‌నంతో ఎవరి జ్ఞానాన్ని ఏమాత్రం అంగీకరించడు. అలాంటి వారికి ఉపదేశించడం వల్ల మీ విలువైన సమయం వృథా అవుతుంది. ఒక వ్యక్తి తన జ్ఞానాన్ని ఎల్లప్పుడూ త‌గిన‌ వ్యక్తికే అందించాలి. తద్వారా అతను దానిని సరైన మార్గంలో ఉపయోగించుకోగ‌లుగుతాడు.


సంతోషంగా లేని వ్యక్తికి దూరం: 

ఆచార్య చాణక్యుడు తెలిపిన జీవన విధానంలో విచారకరమైన స్వ‌భావం క‌లిగిన వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుచుకుంటే ఎవ‌రైనా స‌రే చాలా ఇబ్బందుల్లో పడతారు. అలాంటి వ్యక్తులు అన్ని వేళలా అసంతృప్తిగా ఉండ‌ట‌మే కాకుండా, మిమ్మల్ని కూడా అసంతృప్తికి గురిచేస్తారు. అటువంటి పరిస్థితిలో ఎవ‌రైనాసరే తాను అన్ని సమయాలలో ఇబ్బందులకు గుర‌వుతున్న‌ట్లు భావిస్తాడు. జీవితంలో ముందుకు సాగలేడు. అందుకే సంతోషాన్ని అందుకోలేని వ్య‌క్తికి దూరంగా ఉండాల‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు. చాణక్య నీతి జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉపయోగపడుతుంది. డబ్బుకి సంబంధించిన కొన్ని విధానాలు చాణక్యుడు తెలియ‌జేశాడు. మనం ఈ విషయాలపై శ్రద్ధ వహిస్తే, జీవితంలో ఎప్పుడూ సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడదు. 

డబ్బు దుర్వినియోగం:

ఆచార్య చాణక్యుడి జీవిన విధానాల ప్రకారం, డబ్బు వృథా చేయకూడ‌దు. డబ్బు ఆదా చేయడం ఎవ‌రికైనా స‌రే చాలా ముఖ్యం. ఆదా చేసిన డబ్బు క‌ష్ట‌ సమయాల్లో ఉపయోగపడుతుంది. జీవితంలో నిజాయితీగా డబ్బు సంపాదించాల‌ని, ఈ విష‌యంలో ఎప్పుడూ తప్పుడు మార్గంలో నడవకూడదని చాణ‌క్య సూచించారు. మ‌న ద‌గ్గ‌రున్న‌ డబ్బును ఇతరులకు హాని కలిగించడానికి ఎప్పుడూ ఉపయోగించకూడద‌ని, అలా చేసినవారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వ‌స్తుంద‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు.

Updated Date - 2021-11-18T11:56:35+05:30 IST