డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-05T04:58:01+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఫోన్‌చేసి ఆదేశించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్న రఘునందన్‌రావు

అసంపూర్తి పనులను 48 గంటల్లో పూర్తిచేయాలి

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, జూలై 4: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో నెలకొన్న సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఫోన్‌చేసి ఆదేశించారు. సోమవారం దుబ్బాక పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి, అక్కడ నివాసముంటున్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్‌ తమకు ఎక్కడ పేరు వస్తుందోనని కాలనీలో నివాసముంటున్న వారికి మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీవాసులకు నీళ్లు ఇవ్వ, సమస్యలను సృష్టించే కుట్రను చేస్తున్నారన్నారు. కాలనీవాసులకు 24 గంటల నీళ్లు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న మురుగు కాలువలను పూర్తిచేయడంతోపాటు పగిలిన అద్దాలను తీసేసి, వాటి స్థానంలో మళ్లీ బిగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వారంరోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. అలాగే హరితహారంలో మొక్కలను నాటాలని మున్సిపల్‌ సిబ్బందిని కోరారు. తాము ఇచ్చిన గడువులోగా పనులను పూర్తిచేయకుంటే తామే ప్రత్యక్ష ఆందోళనను దిగుతామని హెచ్చరించారు. 132 డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారులకు 16, 17, 18, 19, 20, 21, 22, 23తోపాటు 39, 40, 41, 42 బ్లాక్‌ నంబర్లలో పనులు పూర్తి కావచ్చిందని, ఈనెల 10వ ఏకాదశి ఉన్నదని ఆరోజు వచ్చి గృహ ప్రవేశం చేయాలని ఆయన కోరారు. పేదల సంక్షేమం కోసమే పనులను పూర్తిచేయాలని, ఆ కాంట్రాక్టర్‌ పనులను చేయకుంటే తాను సొంతంగా పూర్తిచేయిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్‌ మల్లారెడ్డి, నాయకులు బాలే్‌షగౌడ్‌, ఎస్‌ఎన్‌.చారి, శ్రీనివా్‌సరెడ్డి, సుభా్‌షరెడ్డి, బద్రి, ప్రవీణ్‌, భాస్కర్‌, ఉపేందర్‌, రాజు, కనకరాజు తదితరులున్నారు. 

Updated Date - 2022-07-05T04:58:01+05:30 IST