కాటికాపరులకు కరోనా రూపంలో కష్టాలు

ABN , First Publish Date - 2021-05-11T16:07:49+05:30 IST

భద్రచలం, కొత్తగూడెం: కాటికాపరులకు కరోనా రూపంలో కష్టాలు కమ్ముకొచ్చాయి.

కాటికాపరులకు కరోనా రూపంలో కష్టాలు

భద్రచలం, కొత్తగూడెం: కాటికాపరులకు కరోనా రూపంలో కష్టాలు కమ్ముకొచ్చాయి. రాత్రి, పగలు తేడా లేకుండా కరోనా మృత దేహాలు వచ్చిపడుతున్నాయి. శ్మశానంలో చితి మంటలు ఆరడంలేదు. విసుగు, విరామం లేకుండా కాటికాపరులు పనిచేస్తునే ఉన్నారు. శ్మశానమే వారికి జీవనాధారం. అయితే కరోనా మృతదేహాలకు నిప్పుపెడుతున్న వారిని అంటరానివారిగా చూస్తున్నారు. నిత్యవసరాలు కొనుక్కుందామని వెళితే చీదరించుకుంటున్నారు. ఆటో ఎక్కుదామంటే అడ్డుకుంటున్నారని వాపోతున్నారు.


భద్రాచలం శ్మశానవాటికలో పనిచేస్తున్న ఓ మహిళ కాటికాపరి అరుణ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి లేకముందు ఇన్ని ఇబ్బందులు లేవని, కరోనా కల్లోలం మొదలైనప్పటి నుంచి తమను అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగూడెం కాటికాపరి సతీష్ మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు రోజులు తాము విధులు పక్కనపెడితే శ్మశానాలు కుప్పలు, తెప్పలుగా నిండిపోతాయని, తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తుంటే ఇంత చులకనగా చూడడం సరికాదని అన్నాడు. విపత్కర పరిస్థితుల్లోనూ శ్మశానాల్లో మగ్గిపోతున్న తమ సంక్షేమం కోసం ప్రభుత్వం సహాయం చేయాలని కాటికాపరులు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-05-11T16:07:49+05:30 IST