అంతర్రాష్ట్ర వంతెనల వద్ద రాకపోకల బంద్‌

ABN , First Publish Date - 2021-09-17T06:50:32+05:30 IST

బోధన్‌ అంతర్రాష్ట మార్గం గుండా రాకపోకలు సా గించేందుకు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లే దు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాలూర శివా రులోని అంతర్రాష్ట్ర సరిహద్దులో పాత వంతెన కొట్టు కుపోయింది.

అంతర్రాష్ట్ర వంతెనల వద్ద రాకపోకల బంద్‌
వరదనీటి దాటికి కొట్టుకుపోయిన పాత వంతెన పిల్లపాపలతో నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు

ఇబ్బందులు ఎర్కొంటున్న ప్రయాణికులు

మూడు కిలో మీటర్లు నడివాల్సిన పరిస్థితి

బోధన్‌ రూరల్‌, సెప్టెంబరు 16: బోధన్‌ అంతర్రాష్ట మార్గం గుండా రాకపోకలు సా గించేందుకు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లే దు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాలూర శివా రులోని అంతర్రాష్ట్ర సరిహద్దులో పాత వంతెన కొట్టు కుపోయింది. దీనికి తోడు కొత్తగా నిర్మించిన వంతెన కు సైతం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిం ది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అ సౌకర్యంగా మారింది. వంతెన గుండా రాకపోకలు ని లిపివేయడంతో ప్రజలు మూడు కిలో మీటర్లకు పైగా నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. పిల్లాపాపలు, నెత్తిన మూటలతో ప్రజలు వంతెన గుండా నడుస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని గం జ్‌గావ్‌, మాస్సూర్‌, అర్థపూర్‌, బోలేగావ్‌, కార్ల, బడా కార్ల తదితర మహారాష్ట్ర గ్రామాల ప్రజలు తెలంగాణ ప్రాంతంలోకి అడుగు పెట్టాలంటే తొమ్మిది కిలో మీట ర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి పై నుంచి ద్విచక్ర వాహనాలకు మాత్రమే అధికారు లు అనుమతులు ఇచ్చారు. ఆటోలు, కార్లు వచ్చి వెను దిరుగుతున్నాయి. కొందరు ఖండ్‌గావ్‌, తదితర ప్రాం తాల నుంచి 30 కిలో మీటర్ల దూరం గుండా ప్రయా ణిస్తున్నారు. ఆటోలు బోధన్‌ నుంచి సాలూర బ్రిడ్జి వ రకు ప్రయాణికులను తీసుకెళ్లి దించివేస్తున్నారు. అ క్కడి నుంచి ప్రయాణికులు మహారాష్ట్ర సరిహద్దు బ్రి డ్జి వరకు మూడు కిలో మీటర్లకు పైగా నడవాల్సి వ స్తోంది. అక్కడి నుంచి మహారాష్ట్ర ఆటోలు ఎక్కి అద నపు చార్జీలు చెల్లించి గమ్యస్థానాలకు వెళ్తున్నారు. 

 తెలంగాణ-మహారాష్ట్ర మార్గాలకు బస్సు సేవలను సైతం అధికారులు నిలిపివేశారు. పాత వంతెన కొట్టు కుపోవడం, కొత్త వంతెనకు మరమ్మతులు చేపట్టాల్సి ఉండడంతో ఈ మార్గం ద్వారా అధికారులు రాకపోక లను నిషేధించారు. ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు దా టాలంటే ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. తమ గమ్యస్థానాలకు చేరుకోవాలంటే జేబులకు చిల్లు లు పడుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. మూడు కిలో మీటర్ల మేర నడవలేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇక వృద్ధులు, గర్భిణులు, బాలింతల పరిస్థితి వర్ణానతీతంగా మారింది. వంతెనకు మరమ్మ తులు త్వరగా చేపట్టి రాకపోకలకు పునః ప్రారంభిం చాలని ఇరు రాష్ట్రాల ప్రజలు, వాహనదారులు కోరు తున్నారు. అధికారులు ఇప్పటికైనాస్పందించి ప్రజల ఇబ్బందులు దూరం చేసేలా చర్యలు చేపట్టాల్సిన అ వసరం ఎంతైనా ఉంది.

నడక నరకప్రాయంగా మారుతోంది..

-లక్ష్మణ్‌, మస్నూర్‌, మహారాష్ట్ర

ఈ వయసులో 9 కిలో మీటర్లు నడవడం ప్రాణం మీదికి వస్తోంది. పది రోజుల క్రితం పనుల నిమిత్తం బోధన్‌ ప్రాంతానికి వచ్చాను. తిరిగి మహారాష్ట్రలోని స్వగ్రామానికి వెళ్దామంటే రవాణా సౌకర్యం కరువైంది. దీంతో నడక నరకప్రాయంగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం..

-రాహుల్‌, బోలేగావ్‌, మహారాష్ట్ర

కొత్త బ్రిడ్జికి మరమ్మతులు చేపడుతున్నారని రాకపోకలను నిలిపివేశారు. దీంతో 9 కిలో మీ టర్ల మేర నడవాల్సిన వస్తోంది. వయసులో ఉండే మాలాంటి వారే తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నాం. వృద్ధులు, అంగవైకల్యం ఉన్న వారి పరిస్థి తి మరి దయనీయంగా మారుతోంది. సత్వరమే రాకపోకలను పునఃప్రారంభించాలి.

Updated Date - 2021-09-17T06:50:32+05:30 IST