అసంపూర్తి పనులతో ప్రజల అవస్థలు

ABN , First Publish Date - 2021-04-16T06:49:34+05:30 IST

పట్టణంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం, పనుల్లో జాప్యం ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తోంది.

అసంపూర్తి పనులతో ప్రజల అవస్థలు
హోలీక్రాస్‌ రోడ్డులో పైప్‌లైన్‌ పగిలి వృథాగా పోతున్న తాగునీరు

గుడివాడటౌన్‌, ఏప్రిల్‌ 15 : పట్టణంలో మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం, పనుల్లో జాప్యం ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తోంది. ఓ వైపు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణం మరో వైపు పైపులైన్ల నిర్మాణం  చేస్తున్నారు. వీటి కోసం రోడ్లు తవ్వి గుంటలు చేస్తున్నారు. ఈ తవ్వకాల సందర్భంగా తాగునీటి పైపు లైన్లు దెబ్బతిని ప్రజలు నీరందక ఇబ్బందుల పాలవుతున్నారు.  కోతిబొమ్మ సెంటర్‌ సమీపంలోని మంకీ కాలనీలో  పైపులైన్‌ లీకేజి నుండి వచ్చే కల్తీ నీరే మహా ప్రసాదంగా భావించి అమృతంలా తాగు తున్నారు.  పైపులైన్‌ నిర్మాణం కోసం రోడ్ల మార్జిన్లు తవ్వి రోడ్లపై ఇళ్లకు ఎదురుగా పోశారు.  ఆయా ప్రాంతాల ప్రజలు బయటకు రావడం కూడా కష్టంగానే ఉంది. కొత్తపైపుల నిర్మాణం కోసం తవ్వితే పాత పైపులు పగిలి  నీరు వృథాగా పోతోంది.  అర కొర మరమ్మతులు చేపట్టినా కాలనీ లో తాగునీరు రోడ్డును ముంచుతోంది. కొత్తపైపులు వేసి గోతులు పూడ్చలేదు.. కొత్త నీటి కనెక్షన్లు ఇవ్వ లేదు.. రెంటికీ చెడ్డ రెవడిలా  మంకీ కాలనీ  వాసులు తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ సమస్యే కాక పట్టణంలో పలు ప్రాంతాల్లో పైపులైన్ల  లీకులు  కన్పిస్తున్నాయి.  పంచవటి కాలనీ, హరినారాయణ పురం, నైజాం పేట,  తదితర వార్డుల్లో దాహం కేకలు వినపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురు గునీరు సరఫరా జరుగుతోందని ప్రజలు విమర్శి స్తున్నారు. ఏడాది క్రితం జాతీయ రహదారి పక్కనే సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని స్థలం సమీపంలో మేజర్‌ పైపులైన్ల లీకుతో లక్షల లీటర్ల తాగునీరు నేలపాలయ్యాయి. రెండు నెలల క్రితం మరమ్మ తులు చేపట్టి గోతులు పూడ్చకపోవడంతో వ్యాపా రస్తులు గగ్గోలు పెడుతున్నారు. వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. బస్టాండ్‌ సమీపంలో పైపులైన్‌ గొయ్య పూడ్చి మట్టి దిబ్బలు అలాగే ఉంచారు. మునిసిపల్‌ అధికారులు క్షేత్ర స్థాయి పర్య టనను మరవడంతో సమస్యలు పట్టిపీ డిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-04-16T06:49:34+05:30 IST