పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-08T04:03:52+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధా నానికి పాల్పడుతున్నాయని విమర్శించారు.

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 7:  కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలతోనే  సమస్యలు పరిష్కారమవుతాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధా నానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, అధిక ధరలు  విలయతాండవం చేస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తుంటే ప్రధాని మోదీ సక్సెస్‌ఫుల్‌ దేశంగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల వాగ్దానాలను విస్మరించారని, ప్రజలను భ్రమల్లో ఉంచుతూ కాలయాపన చేస్తు న్నారన్నారు. వెంకటస్వామి, సరస్వతి, లింగయ్య, దాగం మల్లేష్‌, చిప్ప నర్సయ్య, ఖలీందర్‌ ఆలీఖాన్‌, ముష్కె సమ్మయ్య, పౌలు, శంకర్‌, పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-08T04:03:52+05:30 IST