వెదజల్లాం.. నీరేదీ?

ABN , First Publish Date - 2022-06-27T06:52:43+05:30 IST

ముదినేపల్లి మండలంలో వెదజల్లిన సార్వా వరి పొలాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది.

వెదజల్లాం.. నీరేదీ?
పెయ్యేరులో ఇంజన్లతో నీరు తోడుతున్న రైతులు

ముదినేపల్లి, జూన్‌ 26 : ముదినేపల్లి మండలంలో వెదజల్లిన సార్వా వరి పొలాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. మండలంలో ఇప్పటికే సుమారు 4 వేల ఎకరాల్లో వరి విత్తనాలను వెదజల్లారు. కాల్వల ద్వారా నీరందకపోవటం, వర్షం కురవకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పోల్‌రాజ్‌, క్యాంప్‌ బెల్‌ ప్రధాన కాల్వలకు నీటి విడుదల తగ్గించటం, పలు బ్రాంచి కాల్వలకు నీటి సరఫరా లేకపోవటంతో వెదజల్లిన వరిపైరుకు నీరందటం లేదు. పెయ్యేరులో రైతులు ఇంజన్ల ద్వారా పంట కాల్వల్లో ఉన్న కొద్దిపాటి నీటిని తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వెదజల్లిన వరి పొలాలకు నీరు అత్యవసరమని రైతులు చెబుతున్నారు. 

Updated Date - 2022-06-27T06:52:43+05:30 IST