సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-05-25T05:38:01+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొండమొదలు గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్‌ శ్రీమన్నారాయణ చెప్పారు.

సమస్యల పరిష్కారానికి కృషి

గంగవరం, మే 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొండమొదలు గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దార్‌ శ్రీమన్నారాయణ చెప్పారు. మండలంలోని నేలదోనెలపాడు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని మంగళవారం ఆయన సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వాసితులను ముంపు గ్రామాల నుంచి పునరావాస కాలనీలకు తరలించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పునరావాస కాలనీలో నిర్వాసితులు ఎదుర్కొనే సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఆయన వెంట వీఆర్వో సత్తిబాబు తదితరులు ఉన్నారు. 

  • ‘ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను పదవి నుంచి తొలగించాలి’
  • అడ్డతీగల, మే 24: దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ ఐక్యవేదిక, అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అడ్డతీగలలో నిరసన తెలిపారు. దేవి సెంటర్‌లో బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ చైతన్య వేదిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెదుళ్ళ లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల మాన ప్రాణాలను దోచుకున్న అనంతను కఠినంగా శిక్షించేవరకు పోరాడతామన్నారు. ఒక దశలో అనంత ఫ్లెక్సీలను చించివేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ అరెస్టును స్వాగతిస్తూ బాణసంచా కాల్చారు. తొలుత ఆదివాసీ భవనంలో బహిరంగ సభ నిర్వహించా రు. టీడీపీ నాయకుడు, జర్తా వెంకటరమణ, బీజేపీ నాయకురాలు స్వప్నకు మారి, జనసేన నుంచి చోళ్ల కృష్ణారెడ్డి, ఏఐకేఎమ్‌ఎస్‌ నాయకుడు ఐ.రమణ, ఆదివాసీ జేఏసీ నాయకులు నర్సన్నదొర, మద్దేటి అంజిరెడ్డి, బడిగుంట వెంక టేశ్వరరావు, బొగ్గుల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. 

అనంతబాబును ఏజెన్సీ నుంచి బహిష్కరించాలి

కూనవరం, మే 24: ఏజెన్సీ వీరప్పన్‌ ఎమ్మెల్సీ అనంతబాబును రంపచోడవరం ఏజెన్సీ నుంచి బహిష్కరించాలని, రంపచోడవరం బీజేపీ కన్వీనర్‌ పాయం వెంకయ్య అన్నారు. అమాయక దళిత యువకుడిని హత్యచేసిన అనంతబాబు ఎమ్మెల్సీ రద్దు చేయాలన్నారు.  అందులో భాగంగానే బీజేపీ ఈనెల 28న బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. దళిత యువకుడి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

అనంతబాబు దిష్టిబొమ్మ దహనం

ఎమ్మెల్సీ అనంతబాబు దిష్టిబొమ్మను సీపీఎం ఆధ్వర్యంలో దహనం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి ఎమ్మెల్సీ రద్దు చేయాలని పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా రంపచోడవరం సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్‌ మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న అటవీ సంపదను  అనంతబాబు అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు రాజు, కూనవరం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పాయం సీతారామయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T05:38:01+05:30 IST