Amritsar Golden Temple వెలుపల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

ABN , First Publish Date - 2022-06-06T18:12:15+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు మారుమోగాయి...

Amritsar Golden Temple వెలుపల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు

అమృత్‌సర్‌(పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ నగరంలోని గోల్డెన్ టెంపుల్ వెలుపల ఖలిస్థాన్ అనుకూల నినాదాలు మారుమోగాయి. ఆలయ సముదాయంలో భింద్రన్‌వాలే పోస్టర్లు కూడా వెలిశాయి. అమృత్‌సర్‌లోని ఆలయ సముదాయంలో దాక్కున్న ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్ 38వ వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ టెంపుల్ వెలుపల సోమవారం ఈ సంఘటన జరిగింది.అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద సోమవారం  కొంతమంది వ్యక్తులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. మొహాలిలోని రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ దాడి జరిగింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలే భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే హత్యకు గురయ్యారు. గత వారం సీఎం మాన్ ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవానికి ముందు శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులను హై అలర్ట్‌లో ఉంచినట్లు సీఎం మాన్ చెప్పారు. 


Updated Date - 2022-06-06T18:12:15+05:30 IST