ప్రజాకంటకంగా వైసీపీ పాలన

ABN , First Publish Date - 2022-08-10T06:47:16+05:30 IST

ప్రజాకంటకంగా వైసీపీ పాలన

ప్రజాకంటకంగా వైసీపీ పాలన
గుడివాడ 36వ వార్డులో రావి, తదితరులు


గుడివాడ, ఆగస్టు 9 : రాష్ట్రంలో ప్రజాకంటక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటినా పట్టించుకోవడం లేదని టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వర రావు మండిపడ్డారు. స్థానిక 36 వార్డులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బాదుడే బాదుడులో ఆయన పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటానన్న సీఎం జగన్మోహనరెడ్డి వాగ్దానాలు తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ప్రజలు నానా ఇబ్బం దులు పడుతుంటే నీరో చక్రవర్తి మాదిరి తాడేపల్లి ప్యాలెస్‌ వీడి రావడం లేదని విమర్శించారు. మరో వైపు విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీల పేరిట మరో బాదుడుకు తెరతీశారని, తక్షణం ట్రూఅప్‌ చార్జీలు ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, జిల్లా బీసీసెల్‌ ఉపాధ్యక్షుడు మెరుగుమాల బ్రహ్మయ్య, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రతినిధి గోకవరపు సునీల్‌, ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్‌ జానీ షరీఫ్‌, తెలుగుమహిళ నాయకులు యార్లగడ్డ సుధారాణి, సిరిపురపు తులసీరాణి, అసిలేటి నిర్మల, గొర్ల శ్రీలక్ష్మి, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పొట్లూరి వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. 

పెడన : రాష్ట్రంలో విధ్వంసక, అరాచక పాలన సాగుతోందని  పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు.  పట్టణంలోని 22, 23 వార్డుల్లో మంగళవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని  నిర్వహించారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఆ వర్గం, ఈ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతే తప్ప అభివృద్ధి లేదన్నారు. అధిక ధరలు, అధిక పన్నుల భారాన్ని మోయలేక రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారన్నారు. కార్యక్రమంలో యక్కల శ్యామలయ్య, వహబ్‌ ఖాన్‌, బొర్రా కాశీ, బొడ్డు దీక్షానందుడు, పులి రవి, ఖుర్షిద్‌ బేగం, మెట్ల సుబ్రహ్మణ్యం, నాగరాజు, సులేమాన్‌ దాదా పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:47:16+05:30 IST