Priyanka Gandhi పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌లు హ్యాక్ కాలేదు...కేంద్ర అధికారులు స్పష్టం

ABN , First Publish Date - 2021-12-23T14:24:16+05:30 IST

ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాలేదని కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి....

Priyanka Gandhi పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌లు హ్యాక్ కాలేదు...కేంద్ర అధికారులు స్పష్టం

న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీ వాద్రా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కాలేదని కేంద్ర అధికారిక వర్గాలు తెలిపాయి. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సీఈఆర్‌టీ-ఇన్‌ ప్రాథమిక దర్యాప్తులో ఖాతాలు హ్యాక్‌ కాలేదని తేలిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. తన పిల్లలైన 18 ఏళ్ల మిరయా వాద్రా, 20 ఏళ్ల రైహాన్ వాద్రాల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందని గాంధీ వాద్రా మంగళవారం ఆరోపించారు.‘‘ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారికి వేరే పని లేదా?’’ అని ప్రియాంకగాంధీ రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీల దాడులు, అక్రమ ఫోన్ నిఘా ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


ప్రియాంక గాంధీ వాద్రా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని, సొంతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీఈఆర్టీ-ఇన్‌కు అప్పగించింది, ఇది హ్యాకర్‌లను కనుగొనే, సైబర్‌టాక్‌లను నిరోధించే అధునాతన ల్యాబ్‌ను నడుపుతోంది.పెగాసస్ స్పైవేర్ సమస్య పబ్లిక్‌గా మారినప్పటి నుంచి అక్రమ ఫోన్ నిఘాపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Updated Date - 2021-12-23T14:24:16+05:30 IST