యోగి ప్రభుత్వంపై మండిపడ్డ ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-10-06T00:32:24+05:30 IST

కాగా ఈ విషయమై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ ‘‘ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. నేరస్థుల్ని అరెస్ట్ చేయడానికి బదులు నిరసన తెలిపిన వారిని నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రజా గొంతుకలను, నిరసనలను దారుణంగా అణచివేస్తున్నారు. విద్యార్థులైనా ఉపాధ్యాయులైనా ఎవరైనా..

యోగి ప్రభుత్వంపై మండిపడ్డ ప్రియాంక గాంధీ

లఖ్‌నవూ: నేరస్తులను వదిలిపెట్టి నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారని, ప్రజా గొంతుకను అణచివేస్తున్నారని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. ఆదివారం లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు సహా ఇతర ప్రతిపక్ష నేతలు నిరసనకు దిగారు. అయితే నిరసన చేస్తున్న పలువురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక గాంధీని గృహ నిర్భంధం చేయగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి బూపేష్ భాఘే‌ల్‌ను లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విషయమై అరెస్ట్‌లు, నిర్బంధాలు కొనసాగుతున్న సమాచారం.


కాగా ఈ విషయమై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ ‘‘ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. నేరస్థుల్ని అరెస్ట్ చేయడానికి బదులు నిరసన తెలిపిన వారిని నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రజా గొంతుకలను, నిరసనలను దారుణంగా అణచివేస్తున్నారు. విద్యార్థులైనా ఉపాధ్యాయులైనా ఎవరైనా నిరసన చేస్తే జైలుకు పంపుతున్నారు. యోగి అణచివేత ధోరణి కారణంగా మరిన్ని తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని అన్నారు.

Updated Date - 2021-10-06T00:32:24+05:30 IST