Abn logo
Jan 21 2021 @ 20:53PM

రష్మికకు షాకిచ్చిన అప్‌కమింగ్‌ బ్యూటీ

రష్మిక మందన్న.. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్రకిరీటంకు అతి చేరువలో ఉన్న స్టార్‌ హీరోయిన్‌. అటువంటి స్టార్‌ హీరోయిన్‌కు ఇప్పుడొక అప్‌కమింగ్‌ హీరోయిన్‌ షాకిచ్చినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. ఇంతకీ ఎవరా అప్‌కమింగ్‌ హీరోయిన్‌ అనుకుంటున్నారా?. నానిస్‌ గ్యాంగ్‌లీడర్‌ సినిమాలో నాని సరసన క్యూట్‌ క్యూట్‌గా కనిపించిన ప్రియాంక అరుల్‌ మోహన్‌. ఈ భామ ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన 'శ్రీకారం' చిత్రంలో నటించింది. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆమె మరో సినిమాకు కూడా సైన్‌ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ప్రియాంక అరుల్‌ మోహన్‌.. రష్మికకు ఎలా షాకిచ్చింది అనేగా డౌట్‌. 

విషయంలోకి వస్తే.. కొన్ని రోజులుగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య తదుపరి చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా సెలక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో దాదాపు రష్మిక కన్ఫర్మ్‌ అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు ఆమె ప్లేస్‌ను ప్రియాంకా రీ ప్లేస్‌ చేసిందని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు స్టార్టయ్యాయి. రష్మికను ఈ సినిమా నుంచి తప్పించడానికి కారణం.. ఆమె డిమాండ్‌ చేసిన రెమ్యూనరేషనే అని తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ను చిత్రయూనిట్‌ దాదాపు ఫైనల్‌ చేసినట్లుగా టాక్‌ నడుస్తోంది. సో.. టాలీవుడ్‌లో పూజా హెగ్డేకు పోటీనిస్తూ.. స్టార్‌ హీరోల సరసన సినిమాలు దక్కించుకుంటున్న రష్మికకు.. కోలీవుడ్‌లో మాత్రం.. ఓ అప్‌కమింగ్‌ హీరోయిన్‌ షాకివ్వడం విశేషమే మరి. దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. 

Advertisement
Advertisement
Advertisement