Jun 8 2021 @ 13:12PM

ఆధినిగా ప్రియాంక‌ అరుళ్

కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న కొత్త చిత్రంలో ఆధినిగా కనిపించనుంది ప్రియాంక‌ అరుళ్  మోహన్. నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయింది. ఇందులో తన పర్ఫార్మెన్స్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల శర్వానంద్‌తో 'శ్రీకారం'లో నటించిన ప్రియాంకకి మంచి గుర్తింపే దక్కింది. ఈ క్రమంలోనే సూర్య - పాండిరాజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటీవ‌ల ఈ చిత్ర దర్శ‌కుడు పాండిరాజ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా బ‌ర్త్ డే విషెస్ తెలిపింది ప్రియాంక. దీనికి బదులిస్తూ థ్యాంక్యూ ఆధినీ అన్నారు. దాంతో సూర్య సినిమాలో ఈమె పోషించే పాత్ర పేరు ఆధిని అని కన్‌ఫర్మ్ అయింది. ఇదే సమయంలో క‌మెడియన్ సూరి కూడా బర్త్ డే విషెస్ తెలుపగా థ్యాంక్యూ సూల‌మ‌ణి అని రిప్లై ఇచ్చారు పాండిరాజ్. ఇక ఈ సినిమాకు డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు.  కాగా శివ‌కార్తికేయ‌న్ హీరోగా రూపొందుతున్న 'డాక్ట‌ర్' మూవీలోనూ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

Otherwoodsమరిన్ని...