Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 26 Jan 2022 17:36:08 IST

ప్రియా ప్రకాష్ వారియర్‌కు చేదు అనుభవం.. అమర్యాదగా ప్రవర్తించిన హోటల్ సిబ్బంది.. దీంతో బయట చలిలోనే..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రియా ప్రకాష్ వారియర్‌కు చేదు అనుభవం.. అమర్యాదగా ప్రవర్తించిన హోటల్ సిబ్బంది.. దీంతో బయట చలిలోనే..

‘ఒరు అడార్ లవ్’ సినిమాలో కన్ను కొట్టి ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్.. చెక్, ఇష్క్ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ఆమెకు హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 


‘‘నేను ఫెర్న్ గోరేగావ్ హోటల్‌లో బస చేశాను. ఈ హోటల్‌లో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం బయటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని హోటల్ లోపలికి తీసుకు రానివ్వరు. హోటల్‌లో బస చేసిన అతిథులు ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే అదనంగా వారికి డబ్బులు వస్తాయి. ఈ సంగతి నాకస్సలు తెలియదు. షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు నేను ఆహారాన్ని కొనుక్కొని వచ్చాను. ఆ ఆహారాన్ని ఇక్కడి సిబ్బంది అనుమతించలేదు. నేను బయటి నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన ఆహారాన్ని హోటల్‌లోకి అనుమతించాలని వినయంగా వేడుకున్నాను. ఆ ఆహారాన్ని బయట పారేయడం ఇష్టం లేదని చెప్పా. కానీ, హోటల్ సిబ్బంది ఆ ఆహారాన్ని బయట వదిలి పెట్టి రావాలన్నారు. లేదంటే చెత్త కుప్పలో పారేయాలని సూచించారు. అంతేకాకుండా చిన్న విషయాన్ని పెద్ద సీన్‌గా క్రియేట్ చేశారు. నేను చెప్పేది అస్సలు వినిపించుకోలేదు. నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో నేను చలిలోనే భోజనం చేయాల్సి వచ్చింది. సాధారణంగా హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఇతర వ్యవహారాలన్ని ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చూస్తారు. ఆ వ్యవహారాలతో ఆర్టిస్టులకు సంబంధం ఉండదు’’ అని ఆమె చెప్పింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement