Abn logo
Jun 3 2020 @ 17:38PM

ప‌బ్లిసిటీ కోసం ఆ ప‌ని చేయ‌లేదు: ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌

‘ఒరు ఆడార్ ల‌వ్’ చిత్రంలో క‌న్నుగీటే సీన్‌తో రాత్రికి రాత్రే జాతీయస్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈమె త్వ‌ర‌లోనే తెలుగులోనూ నితిన్, చంద్ర శేఖ‌ర్ ఏలేటి చిత్రంలో న‌టించ‌నుంది. సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియా వారియ‌ర్‌కు సోష‌ల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.2 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉండ‌టం విశేషం. అయితే రీసెంట్‌గా ఇన్‌స్టాలో ఈ అమ్మ‌డు డీ యాక్టివ్ అయ్యింది. దీంతో ప్రియా వారియ‌ర్ సోష‌ల్ మీడియాకు బై బై చెప్పేసింద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఈ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇన్‌స్టాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంద‌ర్భంలో ప‌బ్లిసిటీ కోసం తాను సోష‌ల్ మీడియాకు దూరంగా వెళ్ల‌లేద‌ని, ఆ అవ‌సరం కూడా త‌న‌కు లేద‌ని ప్రియా వారియ‌ర్ చెప్పారు. మాన‌సిక ప్ర‌శాంత కోసం ఇన్‌స్టా నుండి కాస్త బ్రేక్ తీసుకున్నాన‌ని ఈ మ‌ల‌యాళీ అమ్మ‌డు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement