Jun 18 2021 @ 19:14PM

ప్రేమలో ఉన్నా.. కానీ వివరాలు చెప్పను: యువ నటి

తమిళ చిత్రపరిశ్రమలోని పాపులర్‌ యువ కథానాయికల్లో ప్రియా భవానీ శంకర్‌ ఒకరు. విశ్వనటుడు కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఇండియన్‌-2’ చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే, శిలంబరసన్‌ టీఆర్‌ హీరోగా ‘పత్తు తల’ అనే చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, బుల్లితెరపై కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆమెకు బుల్లితెరపై లభించిన గుర్తింపు కారణంగానే వెండితెరపై మూవీ అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగివుంది. అదేసమయంలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా భవానీ శంకర్‌... అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తోంది. పెళ్ళి ఎపుడు చేసుకుంటారు అనే ప్రశ్నకు ప్రియా భవానీ శంకర్‌ సమాధానమిస్తూ, తాను ఇప్పటికే ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. అయితే, ఆ వివరాలను ఇప్పుడే బహిర్గతం చేయడం న్యాయం కాదని, పైగా ఇలాంటి విషయాలను ముందుగానే బహిర్గతం చేయడం లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుందని ఆమె పేర్కొంది.