సముద్ర తీరాలను ప్రైవేటీకరించడం తగదు

ABN , First Publish Date - 2022-10-07T05:00:20+05:30 IST

కేంద్ర ప్రభు త్వం ఒకవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుండడం చాలద న్నట్లు పవన విద్యుత్‌ పేరిట సము ద్ర తీరాలను కూడా ప్రైవేటుపరం చేయడం బాధాకరమని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నాగేంద్రబాబు పేర్కొన్నారు.

సముద్ర తీరాలను ప్రైవేటీకరించడం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ నేతలు

బద్వేలు, అక్టోబరు 6: కేంద్ర ప్రభు త్వం ఒకవైపు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తుండడం చాలద న్నట్లు పవన విద్యుత్‌ పేరిట సము ద్ర తీరాలను కూడా ప్రైవేటుపరం చేయడం బాధాకరమని  సీఐటీ యూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నాగేంద్రబాబు పేర్కొన్నారు. సుంద రయ్య భవనంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రం గుజరాత్‌, తమిళనాడుల్లోని సముద్ర తీరాలను ఆఫ్‌షోర్‌ విండ్‌ ఫామ్‌లకు లీజు కు ఇవ్వడానికి రంగం సిద్దం చేసిందని ఆరోపించారు. 2015లోనే  కేంద్రం జాతీయ ఆఫ్‌ షోర్‌ ఎనర్జీ పాలసీని నోటిఫై చేసి ఈ రంగాన్ని స్థాపించేందుకు ప్రయత్నించి విఫల మైందన్నారు.  తాజాగా గుజరాత్‌, తమిళనాడుల్లో ఒక్కో పవనవిద్యుత్‌ ప్రాజెక్టు 2 గిగా వాట్స్‌ చొప్పున బిడ్‌లను ఆహ్వానించేందుకు విధానం రూపొందించినట్లు ఇంధనశాఖ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్‌ పేర్కొన్నారని వారు తెలిపారు.

ఆర్థికంగా లాభసాటిగా లేని ప్రాజెక్టులకు కేంద్రం మూలధన మద్ధతు ఇస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు అన్ని సర్వేలు నిర్వహించామని, అనుమతులు కూడా పొందామని వెల్లడించారన్నారు. ఈ విధానంతో సముద్ర తీరాలపై ప్రైవేటు సంస్థలు పెత్తనం చెలాయించనున్నాయని  కావున కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం ఉపసంహరిం చుకోక పోతే ఆందోళనలు చేస్తామన్నారు. డీవైఎఫ్‌ఐ నేతలు చిన్ని, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:00:20+05:30 IST