‘ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి’

ABN , First Publish Date - 2020-07-11T09:03:55+05:30 IST

నాలుగు నెలలుగా వేతనాలు రాక, ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రైవేట్‌

‘ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి’

సైదాబాద్‌/చాదర్‌ఘాట్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలలుగా వేతనాలు రాక, ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం చలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. మలక్‌పేట తిరుమలహిల్స్‌లోని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇళ్ల ముందు నిరసన తెలిపి వినతిపత్రాలను సమర్పించారు. చార్మినార్‌ పంజేషాలోని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రైవేటు టీచర్స్‌ ఫోరమ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ, ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్‌, నవీన్‌, రేణుకా, పవన్‌, వెంకన్న, జాకీర్‌, అలీబాషా, జమీల్‌, నిజాముద్దీన్‌, సురేఖ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-07-11T09:03:55+05:30 IST