దయనీయ స్థితిలో ప్రైవేటు టీచర్లు

ABN , First Publish Date - 2020-07-06T11:20:46+05:30 IST

నాలుగు నెలలుగా వేతనాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు వలస కూలీలకంటే దుర్భరంగా మారాయని టీఏపీటీఏ రాష్ట్ర

దయనీయ స్థితిలో ప్రైవేటు టీచర్లు

రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌లాల్‌ నాయక్‌ చౌహాన్‌ 


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, జూలై 5: నాలుగు నెలలుగా వేతనాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు వలస కూలీలకంటే దుర్భరంగా మారాయని టీఏపీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చందర్‌లాల్‌ నాయక్‌ చౌహాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు టీచర్లకు వేతనాలు అందేలా ప్రభుత్వం యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ టీఏపీటీఏ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా చౌహాన్‌ మాట్లాడుతూ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డీఈవోలకు, కలెక్టర్ల్‌కు చివరకు విద్యాశాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.    కరోనా కష్ట కాలంలో ప్రతీ ప్రైవేటు టీచర్‌కు కరువు భత్యం కింద నెలకు రూ. 15 వేలు ఆర్థిక సహకారాన్ని అందజేయాలని చౌహాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, మహిళా అధ్యక్షురాలు సుజాత, ఉపాధ్యక్షుడు ముకుందం, సలహాదారు సూర్య ప్రకాశ్‌, జిల్లా కన్వీనర్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T11:20:46+05:30 IST