Abn logo
Jul 1 2020 @ 05:55AM

ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలి

ఆత్మకూరు, జూన్‌ 30 : కరోనా విపత్తుతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి నలిశెట్టి శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఎంఈవో నజీర్‌బాషకు వినతిపత్రం అందజేశారు.


శ్రీధర్‌ మాట్లాడుతూ జీతాలు లేక కొందరు ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు పూట గడవక  వీధుల్లో పండ్లు, కూరగాయలు అమ్మ్ముకుంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. గతంలో ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత మా ఉపాధ్యాయులదేనని సన్మానించి ప్రచారం చేసుకున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రస్తుతం స్పందించడం లేదని విమర్శించారు.  కార్యక్రమంలో జనసేన నేతలు అన్నవరపు శ్రీనివాసులు, తోట చంద్రమౌళి, కోటకొండ శ్రీనివాసులు, డబ్బుగుంట నాగరాజు, ఎం పెంచలరత్నం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement