తెలంగాణలో... ఇక ‘ప్రైవేట్ వీధి దీపాలు’

ABN , First Publish Date - 2020-10-18T20:46:30+05:30 IST

తెలంగాణ గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించబోతున్నారు. ఈ క్రమంలో... ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ సంస్థ(ఈఈఎస్‌ఎల్‌)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్ని వీధి దీపాలను అమర్చాలన్న సంఖ్యను కూడా ఆ సంస్థే నిర్ణయించనుంది. నాణ్యత కలిగిన ఎల్‌ఈడీ వీధి దీపాలపై సంస్థ పెట్టుబడి పెడుతుంది. వీటి అమరిక, నిర్వహణ ఖర్చులు ప్రతి నెల పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రిపూట మాత్రమే వెలిగేలా ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణలో... ఇక ‘ప్రైవేట్ వీధి దీపాలు’

హైదరాబాద్ : తెలంగాణ గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించబోతున్నారు. ఈ క్రమంలో... ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసు లిమిటెడ్‌ సంస్థ(ఈఈఎస్‌ఎల్‌)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్ని వీధి దీపాలను అమర్చాలన్న సంఖ్యను కూడా ఆ సంస్థే నిర్ణయించనుంది. నాణ్యత కలిగిన ఎల్‌ఈడీ వీధి దీపాలపై సంస్థ పెట్టుబడి పెడుతుంది. వీటి అమరిక, నిర్వహణ ఖర్చులు ప్రతి నెల పంచాయతీలు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రిపూట మాత్రమే వెలిగేలా ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు.


కాగా ఈ నేపధ్యంలో... పంచాయతీల నుంచి తీర్మానాలను పంపించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇదిలా ఉంటే... వీధి దీపాలను ప్రైవేటు సంస్థకు అప్పగించినపక్షంలో... వాటి నిర్వహణకు సంబంధించి సమస్యలు తలెత్తినపక్షంలో... ప్రజలు తమను నిలదీస్తారని, అందువల్ల... ప్రైవేట్‌కు బాధ్యతలు అప్పగించడం సరికాదంటూ సర్పంచులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో... పలు గ్రామాల నుంచి ప్రభుత్వానికి తీర్మానాలు అందలేదు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 126 పంచాయతీలు ప్రైవేటు వీధి దీపాలకనుకూలంగా తీర్మానాలు ఇవ్వగా, మరో 55 పంచాయతీలు స్పందించలేదు. 

Updated Date - 2020-10-18T20:46:30+05:30 IST