Abn logo
Apr 20 2021 @ 23:33PM

ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలి

విద్యార్థి యువజన ప్రజాసంఘాల జేఏసీ నాయకులు

కడప(మారుతీనగర్‌), ఏప్రిల్‌ 20: ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల జేఏసీ గౌరవాధ్యక్షుడు సలావుద్దీన్‌, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఆర్‌.ఎన్‌.రాజాలు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక చిలకలబావి సమీపంలోని ప్రజాసంఘాల జిల్లా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.శివకుమార్‌, టి.వినోద్‌కుమార్‌, శ్యామ్‌, దస్తగిరి పాల్గొన్నారు. 


స్టడీ సర్కిల్‌ ఏర్పాటు హర్షణీయం 

ప్రభుత్వ ఉద్యోగాల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో డీఎస్పీ సునీల్‌ నగరంలో ఉచితంగా స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయడం హర్షణీయమని సంఘ సేవకుడు సలావుద్దీన్‌, విద్యార్థి ప్రజా సంఘాల జేఏసీ నాయకులు కొనియాడారు. నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, అలాగే బసవతారకం లా కళాశాలలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేసి కోచింగ్‌ సౌకర్యాన్ని కల్పించడంతో డీఎస్పీని వారు సత్కరించారు. 

Advertisement
Advertisement
Advertisement