‘ప్రైవేటు’ రూటే సెపరేటు!

ABN , First Publish Date - 2020-07-31T08:00:12+05:30 IST

కంటికి కనిపించని వైర్‌సతో ఓ వైపు ప్రపంచం మొత్తం పోరాడుతుండ గా.. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం ధనార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా యి. ‘కరోనా లేదు

‘ప్రైవేటు’ రూటే సెపరేటు!

  • జోరుగా ఆన్‌లైన్‌ తరగతులు
  • ప్రభుత్వం వద్దన్నా పట్టించుకోని వైనం
  • ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు కొనాలని ఫోన్లు 
  • జీవో 46కు విరుద్ధంగా ఫీజుల వసూలు
  • హైదరాబాద్‌లో తల్లిదండ్రులకు ఇబ్బందులు
  • ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్‌


హైదరాబాద్‌ సిటీ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కంటికి కనిపించని వైర్‌సతో ఓ వైపు ప్రపంచం మొత్తం పోరాడుతుండ గా.. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం ధనార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా యి. ‘కరోనా లేదు.. గిరోనా లేదు..మాకు సంపాదనే ముఖ్యం’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. నగరంలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న  పాజిటివ్‌ కేసులతో ప్రజలు వణికిపోతున్నారు. వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు నిరవధికంగా మూతపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రజలందరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుండగా.. హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం రెండు నెలలుగా ఆన్‌లైన్‌ తరగతులతో విద్యార్థులు, తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 5526 ప్రభుత్వ గుర్తింపు పొందిన బడుల్లో కొవిడ్‌తో ఇప్పటి వరకు 1000 పాఠశాలలు మూత పడినట్లు సమాచారం.  మిగిలిన వాటిలో దాదాపు 1500 స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు, తమ వద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు పదే పదే ఫోన్‌లు చేస్తూ, మెసేజ్‌లు పంపుతున్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది గ్రేటర్‌లోని ప్రైవేట్‌ బడులు సుమారు రూ.260-300 కోట్ల వరకు నష్టపోయాయని అంచనా. విద్యార్థుల నుంచి పెండింగ్‌ ఫీజులు రాలేదు. ఈ తరుణంలో ఆన్‌లైన్‌ తరగతుల పేరిట ఎడా పెడా డబ్బులు వసూలు చేస్తున్నారు. పాఠశాలల తీరుతో తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. 


జీవో 46 ఉల్లంఘన

కరోనా నేపథ్యంలో బడులు తెరిచి విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వం సూచించింది. ఆన్‌లైన్‌ తరగతులకు కూడా అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నాయి. 5వ తరగతి నుంచి 10 వరకు విద్యార్థుల్లో ఒక్కొక్కరి నుంచి ఇప్పటికే రూ.10 వేలు వసూలు చేశాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, బడులు తెరిచినా విద్యార్థుల నుంచి ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలంటూ ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. అయితే నగరంలోని చాలాబడులు జీవోని పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయం గా వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. అడిగిన ఫీజు ఇవ్వకుంటే పిల్లల సీట్‌ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న నాలుగు పాఠశాలలపై విద్యా శాఖ అధికారులు దాడులు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇవ్వలేదని, ఇష్టమొచ్చినట్టుగా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీ సుకుంటామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం డబ్బుల వసూలు కోసం సీట్లు అయిపోతున్నాయని, టర్మ్‌ ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆన్‌లైన్‌ తరగతులు, ఫీజుల వసూళ్లపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-31T08:00:12+05:30 IST