కరోనాతో ప్రైవేటు ఆస్పత్రి నర్సు మృతి

ABN , First Publish Date - 2020-05-26T01:57:56+05:30 IST

లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న కరోనాతో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నారు ఆరోగ్యసిబ్బంది.

కరోనాతో ప్రైవేటు ఆస్పత్రి నర్సు మృతి

న్యూఢిల్లీ: లక్షలాదిమంది ప్రాణాలు బలిగొంటున్న కరోనాతో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్నారు ఆరోగ్యసిబ్బంది. ఈ క్రమంలో వీరికి కరోనా సోకే ప్రమాదం అత్యధికంగా ఉంటోంది. అయినాసరే తెగించి తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా సిబ్బంది. కొంతమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. కేరళకు చెందిన సదరు మహిళను మే 22న సఫ్దార్‌గంజ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఐసీయూకు తరలించి చికిత్స అందించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఆమె కరోనాతో మరణించింది. కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 500మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం.

Updated Date - 2020-05-26T01:57:56+05:30 IST