ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజు ప్రపోజల్స్‌ను పంపాలి: సాంబశివరెడ్డి

ABN , First Publish Date - 2022-01-29T23:18:10+05:30 IST

ఏపీలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ఫీజు ప్రపోజల్స్‌ను పంపాలని

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజు ప్రపోజల్స్‌ను పంపాలి: సాంబశివరెడ్డి

అమరావతి: ఏపీలోని అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు ఫీజు ప్రపోజల్స్‌ను పంపాలని పాఠశాల విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శి ఆలూరు సాంబశివరెడ్డి పేర్కొన్నారు. 2021-22, 2023-24 పిరియడ్‌కు పీ ప్రపోజల్స్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేయాలని ఆయన తెలిపారు. దీని కోసం శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసిందన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు తాము కోరుతున్న ఫీజులను, జమా ఖర్చులను, డాక్యుమెంట్లను, కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 15 చివరి తేదీ అని, ఈ లోగా వివరాలను అందించాలన్నారు. హైకోర్టు సూచన మేరకు విద్యసంస్థల్లో మౌళిక సదుపాయాలు దృష్టిలో పెట్టుకొని ఫీ స్ట్రక్చర్‌ను సవరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు కూడా తమ ప్రపోజల్స్‌ను పంపించాలని ఆయన సూచించారు. ఏదైనా విద్యాసంస్థ దరఖాస్తు చేయకపోతే మూడు సంవత్సరాల బ్లాక్‌ పీరియడ్‌కు ఫీజుల వసూలును నిలిపివేస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-29T23:18:10+05:30 IST