వాట్సాప్‌ నుంచే బ్యాంకింగ్ సేవలు!

ABN , First Publish Date - 2020-09-12T23:45:27+05:30 IST

ఇప్పటివరకు వాట్సాప్‌ అంటే ఓ చాటింగ్‌, షేరింగ్‌ అప్లికేషన్‌గానే మనకు తెలుసు. కానీ త్వరలో ఈ అప్లికేషన్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు కూడా పొందవచ్చని మీకు తెలుసా..? అవును ప్రస్తుతం దిగ్గజ బ్యాంకులన్నీ వ్యాట్సాప్‌ ద్వారా...

వాట్సాప్‌ నుంచే బ్యాంకింగ్ సేవలు!

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకు వాట్సాప్‌ అంటే ఓ చాటింగ్‌, షేరింగ్‌ అప్లికేషన్‌గానే మనకు తెలుసు. కానీ ఈ అప్లికేషన్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవలు కూడా పొందవచ్చని మీకు తెలుసా..? అవును ప్రస్తుతం దిగ్గజ బ్యాంకులన్నీ వ్యాట్సాప్‌ ద్వారా కూడా కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. బ్యాంకులు అందిస్తున్న ఈ సరికొత్త సేవలపై స్పెషల్‌ స్టోరీ మీకోసం.


ప్రస్తుతం ప్రజల రోజువారీ జీవితంలో బ్యాంకింగ్‌ భాగమైపోయింది. అందులోనూ డిజిటల్‌ ఇండియా వచ్చిన తరువాత ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వినియోగదారులు భారీగా పెరిగారు. బ్యాంకులు కూడా అందుకు తగినట్లుగానే కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు అందిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే కొన్ని బ్యాంకులు వాట్సాప్ ద్వారా కస్టమర్లకు సర్వీసులను అందించడం ప్రారంభించాయి.


ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ సేవల ద్వారా ఖాతాదారులు వాట్సాప్‌ నుంచే తమ ఖాతా వివరాలు పొందవచ్చు. మిని స్టేట్‌మెంట్, చెక్ బుక్, క్రెడిట్ కార్డు వివరాలు, రుణాలకు సంబంధించి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్లు వంటి వివరాలు కూడా బ్యాంకులు అందజేస్తున్నాయి. కస్టమర్లు వాట్సాప్ సర్వీసుల ద్వారా సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్, చివరి 3 లావాదేవీల వివరాలు, క్రెడిట్ కార్డు లిమిట్, ప్రీ అప్రూవ్డ్ ఇన్‌స్టంట్ లోన్ ఆఫర్స్,, కార్డు బ్లాక్ వంటి సేవలు పొందే అవకాశాన్ని ఆయా బ్యాంకులు వినియోగదారులకు అందజేస్తున్నాయి.

Updated Date - 2020-09-12T23:45:27+05:30 IST